Wednesday, February 3, 2010

పరిచయ వాక్యములు

నిత్య జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న కష్ట సుఖాలకు నవ గ్రహములే కారణము. ఈ నవ గ్రహముల గురించి తెలిపే శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రము. మానవుని కష్టాలు, నష్టాలు, దుహ్ఖాలు అనే కారు చీకటి నుంచి , శాంతులు అనే దివ్యమైన వెలుగు ను చూపించే శాస్త్రమే ఈ జ్యోతిష్య శాస్త్రము. పడవ నడుపువానికి చుక్కాని ఎంత అవసరమో, మానవులకు ఈ జ్యోతిష్య శాస్త్రము కూడా అంతే. అలాంటి ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మా తాత గారైన అన్నం భట్లు, తండ్రి గారైన నారాయణ మూర్తి గార్లు అభ్య సించి, పది మందికి చెప్పేవారు. అలా వంశపారంపర్యంగా నాకు జ్యోతిష్యం మీద అవగాహన కలిగినది. ఒక సమయంలో తండ్రి మరణించటం, సోదరి మరణించటం, ఉద్యోగం లేకపోవటం లాంటి ఎన్నో సమస్యలు తలెత్తినాయి. జ్యోతిష్యం తెలిసిన నాకే ఇన్ని సమస్యలు తలెత్తట్టం జరిగింది. ఇంక సామాన్యులకు ఇలా జరిగితే ఎలా? అనే ఉద్దేశ్యంతో ఎన్నో గ్రంధాలను, పరిశీలించి, పరిశోధించి, గురువులను, పండితులను, పామరులను, జ్ఞానులను శాంతుల గురించి అడిగి తెలుసుకొని, నేను ఆచరించి, నా మిత్రులను ఆచరించమని చెప్పి, మంచి ఫలితములు పొందినాము. జాతకము సరిగా లేకున్న ఈ శాంతులను చేసుకొని, జాతకము లేని వారు కూడా శాంతులను చేసుకొని, వారి వారి ఇబ్బందుల నుండి ఉపశమనం పొందగలరని ఆశిస్తున్నాను. మీరు ఏ గ్రహాలకు శాంతులను చేసుకోవాలో తెలియకుండా వుంటే, మీ పేరు, పుట్టిన తేది, నెల, సంవత్సరం, పుట్టిన వూరు వివరాలను నాకు సందేహాలు@జిమెయిల్.కం కి పంపితే, మీకు వారం లోపల మీరు చేసుకోవాల్సిన శాంతులను గురించి మీ మెయిల్ కు పంపటం జరుగుతుంది. ఇది పూర్తి ఉచితం గా చెప్పబడును. ఖచ్చితంగా ఈ శాంతుల మూలంగా మీరు ఇబ్బందుల నుండి దూరమౌతారని, ఆ దేవుని ఆశీస్షులు మీకు ఎల్ల వేళలా ఉంటాయని ఆశిస్తున్నాను.
సర్వే జనాః సుఖినో భవంతు.

No comments:

Post a Comment