Tuesday, January 26, 2010

ధర్మ సందేహాలు

ఈ శీర్షిక మీ కోసం మీకు వచ్చే సందేహాలను తీర్చటం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ శీర్షిక క్రింద మీరు రోజువారి చేయ వలసిన పనులను గురించి, దేవునికి సబందించిన విషయాలు, జాతక భాగానికి సంబందించిన విషయాలు, వాస్తు దోషాల గురించి, వివాహ విషయాలు, శాంతులు, ఆహార విషయాలు, పంచాంగం, వ్రతాల గురించి, పండుగలు జరుపుకొను విధానాలు గురించిన సందేహాలను నా మెయిల్ కి పంపితే ,మీ సందేహాలకు సమాధానాలను ఒక వారం లోపులో సైటులో పెట్టటం జరుగుతుంది. మీ పేరు, వూరుతో పాటు మీ సందేహాలను పంపవలసిన మెయిల్:sandehalu@gmail.com.
 chinni suresh babu,Nellore.
1.దశావతారాల పేర్లు తెలపండి ?
జవాబు:మస్త్య,కూర్మ ,వరాహ,నరసింహ, వామన,శ్రీ రామ ,పరసు రామ,కృష్ణ,బుద్ధ,కల్కి.

Ashok Obulam,Nellore.
2.పురాణాలు ఎన్ని?వాటి పేర్లు తెలపండి?
జవాబు:అష్టాదశ పురానాలు,అనగా 18.అవి:భాగవతం,భవిష్య ,మస్త్య,మార్కండేయ,బ్రహ్మ,బ్రహ్మవైవర్త,బ్రహ్మాండ,విష్ణు,వరాహ,వామన,వాయు,అగ్ని,నారద,పద్మ,లింగ,గరుడ,కూర్మ,స్కాంద పురాణాలు.

Padma Avadanam,Nellore.
3.స్త్రీలు శ్రీ సూక్తం చదువవచ్చా?
జవాబు: అమ్మవారి సూక్తం చదవడంలో అనుమానం వద్దు.నిరభ్యంతరంగా చదవవచ్చు.

కృతజ్ఞతాభి వందనములు

మొదటగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీ కీ.శే. కనుమళ్ళ నారాయణ మూర్తి, కళ్యానమ్మ గార్లకు,
నాకు జ్యోతిష్యంలో ప్రాధమిక విద్యను నేర్పించిన జ్యోతిష్య బ్రహ్మ శ్రీ ఆమంచర్ల శ్రీనివాస్ గారికి, ఉన్నత విద్యకు "స్టార్ లార్డ్ ధశాసిష్టం" ద్వారా తోడ్పడిన గురువులు (ఆయనకు ఏకలవ్య శిష్యుడను) జ్యోతిష్య రత్న, దైవజ్ఞ రత్న శ్రీ వేరే కొండప్ప గారికి, నాకు ఈ విధంగా ఇంటర్నెట్ లోవెబ్ సైట్ పెట్టి, పది మందికి సలహాలు ఇవ్వవచ్చు అని, ఈ వెబ్ సైట్ నిర్వహణలో, తయారీలో నాకు సహాయ సహకారాలు అందించిన శ్రీ బాల మురళి గారికి,
జ్యోతిష్య ఋషులైన పరాశర, వరాహమిహిరాచార్యులు, మాన సాగర, జైమిని, నారద, బృగు, కళ్యాణ వర్మ, మంత్రేశ్వర, వైద్య నాద మొదలగు గురువులకు,
నాలో ఆధ్యాత్మిక ఆలోచనలు, విషయాలు పెంపొంధిస్తున్న నెల్లూరు తల్పగిరి రంగనాద స్వామి, షిర్డీ సాయి నాదునికి,
నేను జ్యోతిష్య విద్యను నేర్చుకొనుటకు కావలసిన వేల రూపాయల పుస్తకములు కొని ఇచ్చి, నాచే మొదటగా జాతక చక్రములు చూపించుకొని, పరిహార క్రియలు చేసుకొని సత్పలితములు పొందిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు అనికేపల్లి వాస్తవ్యులు శ్రీ గుమ్మడి రాజ యాదవ్, అల్లూరు వాస్తవ్యులు శ్రీ బండి రాజా రమేష్ రెడ్డి, గోనెల విజయ కుమార్ గార్లకు, దొంతాలి వాస్తవ్యులు శ్రీ చండి హరిబాబు యాదవ్ గారికి, వెంకటగిరి వాస్తవ్యులు శ్రీ బొక్కసం భవానీ నాగేంద్రప్రసాద్ గారికి, నెల్లూరు వాస్తవ్యులు వూరందూరు మల్లిఖార్జున రావు, వెంకట సుబ్బయ్య, ఓబులం అశోక్, రాధాకృష్ణ, ఉప్పాల శ్రీధర్ గార్లకు,

కృతజ్ఞాతాభివంధనములతో

మీ
కనుమళ్ళ అశోక్

Saturday, January 23, 2010

నిత్య కృత్యాలు-రెండో పేజి

  1. సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి. సూర్యాస్తమయం కానిదే నిద్ర పోకూడదు.

Thursday, January 21, 2010

ఇతర విషయాలు

  1. పుణ్యం కోసమో లేక మరేదో ఆశించి చేసే దానం , దానం కాదు. దాత దానం చేసిన వెంటనే మర్చిపోవాలి. చేసిన దానం మూడో కంటికి తెలియకూడదు. అలా చేస్తేనే దాన ఫలం లభిస్తుంది. అదే గుప్త దానం.
  2. నవరత్న ఉంగరములు అందరు పెట్టుకొనరాదు. ఎవరికి ఏ రత్నం ధరించవచ్చునో దానిని ధరించుట మంచిది.
  3. జాతి రత్నములు వేలికి ధరించినపుడు నియమాలు పాటించాలి. పాటించని పక్షములో మంచికన్నా చెడె ఎక్కువ జరుగును. ధరించి ఉన్నపుడు స్త్రీసంపర్కము, మైల, శవములు తాకుట, జూదము, బహిష్టులను తాకుట లాంటి దోషముల వల్ల రత్న ప్రభావము నశించును. అట్టి సమయమందు పౌర్ణమి నాడు రాత్రి మేకపాలు తెచ్చి , వాటితో శుద్ధి చేసేది. (లేదా) పసుపు నీళ్ళు తో శుద్ధి చేసి ,సాంబ్రాణి పొగ వేసేది.
  4. జాతి రత్నములు ధరించునపుడు ఎన్ని కారేట్లులో పెట్టుకోవాలంటే తొమ్మిది సంవత్సరముల లోపువాల్లకి ఒక కేరెట్ , పదునెనిమిది సంవత్సరములోపు వారు రెండు కేరెట్లు, ఆపై వారికి మూడు కేరెట్లు బరువు ఉండునట్లు ఉంగరము చేఇంచి, అడుగు భాగము ఆరత్నము శరీరమునకు తగులునట్లు ధరించాలి.
  5. మనం వాడే వస్తువులు కొన్ని విరిగి పోతూఉంటై. వాటిని వాడటం శ్రేయస్కరము కాదు. వాటిని పారవేయాలి. ఉదా: అద్దాలు, దేవుని ప్రతిమలు.
  6. కుడి చేత్తో చేయాల్సిన పనులు ఎడమ చేతితో, ఎడమ చేత్తో చేయాల్సిన పనులు కుడిచేతితో చేయరాదు.
  7. రుద్రాక్షలు కార్తీక మాసంలో, సోమవారం రోజున ధరిస్తే మంచిది. అవసరమనుకుంటే ఎపుడైనా ధరించ వచ్చు. కాని ఆవు పాలతో ఆ రుద్రాక్షను కడిగి, నూటయెనిమిది సార్లు ఓం నమ్హ శివాయ మంత్ర జపం చేసి ధరస్తే మంచిది.
  8. కాకి తలపై తన్నిన, తగిలిన దోషం, వెంటనే తలస్నానం చేసి, శివ దర్శనము చేసుకోవాలి. ఎక్కువ సార్లు అలా జరిగిన మూడు రకాల నూనెలతో దీపం వెలిగించాలి, మరియు శివునకు రుద్రాభిషేకం చేఇంచేది.
  9. నూనె క్రింద పడితే శుబ్రం చేసుకోండి గాని దానిని ఎత్తి గిన్నెలో పోసుకొని వాడవద్దు.
  10. చీకటి పడిన తర్వాత ఇల్లు వూడవరాదు.(చిమ్మ రాదు)
  11. శనివారం రోజు నూనెతో శరీరాన్ని మర్దన చేసి స్నానం చేయరాదు.

Wednesday, January 20, 2010

వివాహము-ఇతరములు

  1. అక్క చెల్లెళ్ళకు ఒకే సంవత్సరము గాని, ఒకే సమయమందు గాని వివాహము చేయరాదు. అట్లు చేసిన ఒకరు వితంతువ అగును.
  2. భార్య గర్భవతిగా ఉంటె గృహ నిర్మాణము చేయరాదు. కొండలు ఎక్కరాదు. ఉదా:తిరుమల, శబరిమలై.
  3. పుట్టిన పిల్లవానికి పదకొండవ రోజు(లేదా) పదమూడవరోజు నామ కారణం చెయ్యాలి. ఆరు నెలల వయస్సు వచ్చిన తర్వాత అన్న ప్రాసన చేయాలి. పురుషులకు సరి, స్త్రీలకు బేసి నెలలో అన్నప్రాసన చేయాలి.
  4. పగటి పూట సంభోగించ రాదు. భార్య తోనైనా సంభోగించరాదు. తన కంటే ఎక్కువ వయస్సున్న స్త్రీతో సంభోగించరాదు.
  5. వివాహంలో తలమ్బ్రాలలో బియ్యంతో గులాబి పూలు త్రుంచి వేయుట, తొడిమలతో వేయుట చేయరాదు. అలా త్రుంచి వేసిన భార్యాభర్తలకు ఈజన్మలో గాని, మరు జన్మలో గాని కలహములు, ఎడబాటులు యేర్పడును. వారిలో ఒకరు ఆకాలములో మరనించుట జరుగును.
  6. గర్భిణి స్త్రీ ఏది కోరితే ఆ వస్తువు తెచ్చి ఇవ్వాలి. గర్భవతికి ఆరు నెలలు నిండిన పిమ్మట ఆమె భర్త గృహారంభం, సముద్ర ప్రయాణం, క్షౌరం చేసుకొనుట, శ్రాద్ధాన్న భోజనం చేయుట, పుణ్యతీర్ధములు సేవించుట, శవము ను మోయుట, శవం వెంట నడచుట, సంభోగం చేయుట, నదీస్నానములు చేయుట, కొండలు ఎక్కుట, దూర దేశ నివాసములు, కలహించుట మొదలగునవి చేయకూడదు. ఇంకా గర్భిణిస్త్రీ ఏనుగు,పర్వతాలు,మేడలు ఎక్కరాదు. దిగంభారాలై స్నాన మాడరాదు. అసుర సంధ్య వేళ భుజించ రాదు. సంభోగం చేయరాదు. గోళ్ళు కొరుకుట, గిల్లుట, ఆకులు తుంచుట చేయరాదు. మాంసం తినరాదు.
  7. కొత్త కోడలు అత్తవారింట ఉండుట, కాపురమునకు వెళ్ళుట: వివాహమైన సంవత్సరములో మొదటి ఆషాడ మాసమున కోడలు అత్త వారింటఉన్న అత్తకు గండము, క్షయ మాసమున ఉన్న తానే మరణించును. జ్యేష్ట మాసమున ఉన్న బావకు గండం. పుష్య మాసమున ఉన్న మామకు, అధిక మాసమున ఉన్న భర్తకి గండము. చైత్ర మాసమున తండ్రిఇంట నున్న తండ్రికి గండము. మిగిలిన మాసములు సుఖము కలుగును.

Tuesday, January 19, 2010

జాతకం లేని వారికి శాంతులు

  1. ఈ శీర్షిక జాతకం లేని వారికి చాలా ఉపయోగపడుతుంది. అంటే పుట్టిన సమయం లేని వారికి. ఐతే జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును. ఆదిత్య హృదయం: ఇది సూర్యునికి సంభందించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పటించుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐ స్వర్యాలను పొందుతారు. మరియూ మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది.పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుండి, దుహ్ ఖముల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పటించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాదించాడు.
  2. రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం: జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే "రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం" నలుబై ఒక రోజులు పారాయణ చేస్తూ ,నవగ్రహాలకు రోజూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి. చివరి రోజు కందులు,యెర్ర గుడ్డ,ధనము దక్షిణగా పెట్టి,కుజునకు మీపేరు మీద అష్టోత్తరం చేఇంచండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.
  3. మీకు వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ, అప్పులు వసూలుకాకుండా ఉండటం జరుగుతోందా? ఐతే మీరు "విష్ణు సహస్ర నామ స్తోత్రం" నలుబై ఒక్క రోజులు పారాయణ చెయ్యండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేఇంచండి. మీ భాదలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.
  4. మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా? ఐతే మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయిన్చండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేఇంచండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేఇస్తే ఇంకా మంచిది. (లేదా)" సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.
  5. వివాహం ఆలస్య మవుతోందా? ఐతే మీరు "రుక్మిణి కల్యాణం" పారాయణ చెయ్యండి. (లేదా) నలుభై ఒక్క రోజులు ,రోజుకి నలుభై ఒక్క ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చెయ్యండి.ఐతే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.
  6. ధనమునకు ఇబ్బంది పడుతున్నారా? ఐతే ధన కారకుడైన సాయి బాబా పారాయణ నలుభై ఒక్క రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు,అరటి తొక్కలు,ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. నలుభై ఒకటవ రోజు బూంది ఒకకిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి.
  7. డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ: ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు "ఏకన్యాస రుద్రాభిషేకం" చెయ్యండి. అలాగా ఎనిమిది మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేఇంచండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి.
  8. ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ "శ్రీ సూక్తము" పారాయణ చేయవలెను.
  9. హనుమాన్ చాలీసా : హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం "హనుమాన్ చాలీసా". ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిరి. ఈ హనుమాన్ చాలీసాను దినమునకు పదకొండు పర్యాయములు చొప్పున మండలం(నలుభై రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని నూట ఎనిమిది పర్యాయములు పటించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ మూడు వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును.

Sunday, January 17, 2010

దైవ సంబంధాలు-రెండో పేజి

  1. అయ్యప్ప మాల ధరించ కూడని సందర్బములు: కుటుంబములో తల్లి, తండ్రి మరణించిన చొ ఏడాది కాలము సూతకము పాటించ వలెను.కావున ఆ కాలములో తనయులు శబరిమలకు మాల దరించ కూడదు. భార్య మరణించిన చో ఒక ఏడాది,సోదరులు ,putrulu, అల్లుళ్ళు,మేనత్తలు,మేన మామలు,తాత,బామ్మ మున్నగు వారు మరణించిన చో ముపై దినములు,మనుమళ్ళు,మనుమరాళ్ళు,దాయాదులు మరణించినచో ఇరవై ఒక దినములు, ఇంటి పేరు గలవారు,రక్త సంబంధీకులు, వియ్యాల వారు మరణించినచో పదమూడు దినములు, ఆత్మీయులు, మిత్రులు మరణించినచో మూడు దినములు దీక్ష తీసు కొనరాదు. తల్లి,భార్య,కూతురు,కోడలు,మరదలు మున్నగు వారు ఇదు నెలల గర్బిని ఇనచో మాల ధరించరాదు. దీక్షలో ఉండగా బంధు వర్గాదులలో yevvaru మరనిన్చినాను ఆ వార్త తెలియగానే మాల విసర్జన చెయ్యవలెను.అలా కాక మాలో మాకు మాట పలుకులు లేవు,కనుక మాకు ఆ మరణంతో ఎలాంటి పట్టింపులు లేవు అనకూడదు. ఏ కారణం చేతనైనా మాల విసర్జన జరిగినచో మరల ఆ ఏడాది మాల దరించ రాదు.ఇరుముడి లేకుండా మామూలు దుస్తులతో స్వామీ వారిని దర్శించ వచ్చును.
  2. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటపుడు ఈ మంత్రమును జపిస్తూ తిరగాలి. "ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయచ, గురుశుక్ర, సనిభ్యస్చ, రాహవే కేతవే నమః ".
  3. ఎల్లవేళలా అనగా ఖాళిసమయంలో ఏదో ఒక మంత్రం పటిస్తూ ఉండండి. భీజాక్షరాలు వద్దు. ఉదా: ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.

Saturday, January 16, 2010

ఆహార విషయాలు

  1. యజ్ఞ యాగాదులకు పిలవకున్నను వెళ్ళవలెను. పెళ్ళికి పిలిస్తేనే వెళ్ళాలి. బంధువులుకాని యెడల వారి కర్మ క్రియలకు,భోజనాలకు పిలిచినా వెళ్ళరాదు. ఆ భోజనం చేయుట దోషం.
  2. అరటి పండును తిన్న వెంటనే మజ్జిగ త్రాగరాదు.
  3. భోజనము చేసిన వెంటనే స్నానము చేయరాదు.
  4. ఉపవాసము చేయునపుడు తినతగినవి: నిషిద్ధములు కాని దుంపలు, పచ్చి కాయలు, కొబ్బరి, కొబ్బరినీళ్ళు, పిండితో చేసిన రొట్టెలు,నీళ్ళు, ఉప్పుడుపిండి, గుగ్గిళ్ళు, పంచదార, బెల్లంతో కలిపినవి, పేలాలు, అటుకులు. ఇవి ఫలములతో సమానము తినవచ్చు.
  5. కార్తీక మాస భోజన విశిష్టత: కార్తీక మాసమందు ఏ దినమునందైన బ్రహ్మనులతోను, బంధువులతోను కలసి రావి, వేప, పెద్ద ఉసిరి, మామిడి, మారేడు, వెలగ, మర్రి, చింత వీటితో కూడి ఉండి బావి యున్న వనమున భోజనము చేసిన వారు వరుసగా నూరు జన్మలందు జగదీస్వరుడై జన్మించును. దీనికి దృష్టి దోషం లేదు.
  6. అరటి, మర్రి ఆకులతో చేసిన విస్తర్లలో భోజనం చెయ్యాలి. మట్టి(లేదా) రాగి పాత్రలో నీరు త్రాగితే శ్రేష్టం.
  7. అన్నదానం చేయాలనుకుంటే ఎంగిలిది, వదిలేసినది, పాడైనది పెట్టవద్దు. అన్నదానమిచ్చిన తర్వాత మీరు తినండి.

వాస్తు విషయాలు

  1. ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫోటోలు అమర్చరాదు. దేవుళ్ళ ఫోటోలను అమర్చాలి. వీలుంటే వినాయకుని ఫోటో అమర్చాలి.
  2. ఇంటి గోడలు కట్టేట్టపుడు తాపీ మేస్త్రీలు,పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తువుంటారు.వాటిని అవసరం తీరగానే ఆకన్నాలు మూసెయ్యాలి.
  3. వాయువ్యం పెరిగిన,మూతపడిన ఇంకే వాయువ్య దోషాలు ఉన్న వాయువ్యంలో వాయు పుత్రుడైన హనుమంతుని ఉంచి పూజించిన ఆ దోషాల తీవ్రత తగ్గును.
  4. తూర్పు ఈశాన్యం,ఉత్తర ఈశాన్యం,పడమర వాయువ్యం,దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం,ఉత్తర వాయువ్యం,పడమర నైరుతి,దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు దోషపూరితం.
  5. బీరువాలు నైరుతి యందుంచి, ఉత్తరమునకు తెరుచునట్లు ఉంచాలి.
  6. తూర్పు మరియు ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లను పెంచరాదు.
  7. మూడు పసుపు కొమ్ములు,పసుపు దారంతో షాపు గుమ్మానికి వ్రేలాడదీయండి. దృష్టి దోషం పోతుంది మరియు వ్యాపారాభివృద్ధి ఉంటుంది.
  8. పడమట వైపు స్తలం కొనుక్కొన్న భార్యకు అనారోగ్యం,నష్టం కలుగును.
  9. ఈశాన్యంలో బరువు ఉంచరాదు. పడమర వైపు, దక్షిణం వైపు బరువులు ఉంచవచ్చును.
  10. దేవాలయాల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించరాదు. ఉండరాదు.
  11. పాముల పుట్ట ఉన్న స్థలం కొనరాదు. కొని పుట్ట తొవ్వి తీసుకోవచ్చు అనుకొంటే, ఆ కుటుంభానికి తరతరాలుగా నాగ దోషం పట్టుకొంటుంది. దాని వలన సంతాన నష్టం జరగటం, కుంటి, గుడ్డి, మూగ, చెముడు పిల్లలు జన్మించుట, ఆ పిల్లలు ఆకాలంలో మరణించుటం జరుగుతుంది.

పంచాంగం విషయాలు

  1. అక్షయ తృతీయ,విజయదశమి,కార్తీక మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున సాయంత్రం వరకు సాడేతీన్ ముహూర్తములు అంటారు. ఈ దినములలో పంచాంగం చూడకుండానే ప్రతి శుభకార్యం ప్రారంభించవచ్చు.
  2. రాహు కాలంలో శుభకార్యాలు,గులికకాలంలోఆశుభకార్యాలు ప్రారంభించరాదు.
  3. తిధులు: రెండు పక్షములన్దున చవితి,షష్టి,అష్టమి,నవమి,ద్వాదశి,చతుర్ధశి తిధులలో మంచి పనులు మొదలుపెట్టకూడదు. అమావాస్య రోజు పితృ కర్మలు చేయవచ్చును.శుభ కార్యాలు చేయరాదు.
  4. గ్రహణం పట్టుచుండగా స్నానం,పూర్తిగా పట్టినపుడు జపము,విడచిన పిమ్మట స్నానం చెయ్యాలి. గ్రహణం తర్వాత ఏడు రోజులు ఎటువంటి శుభకార్యాలు చేయరాదు.
  5. ప్రయానమునందు అపశకునము కలిగిన కాళ్ళు కడుగుకొని, కాస్త విశ్రమించి, బెల్లమును తిని బయలుదేరాలి.
  6. శన్యూషః కాలం: అనగా శనివారం రోజు సూర్యోదయమునకు ముందు రెండు ఘడియల (నలుభది ఎనిమిది నిముషాలు)నుంచి సూర్యోదయం వరకు వుండే కాలాన్ని శన్యూషః కాలం అంటారు. ఆ సమయంలో ఏ మంచి పని మీద అఐ నను ప్రయాణం మొదలెడితే, ఆ పని తప్పక నెరవేరుతుంది. అంటే ఆ సమయంలో ప్రయాణం చెయ్యాలి.

Thursday, January 7, 2010

కేతు గ్రహానికి శాంతులు

  1. కేతువుకి ఏడు వేలు జపం+ఏడు వందలు క్షీరతర్పణం+డెభై హోమం+ఏడు మందికి అన్నదానం చేసేది.
  2. వినాయక చవితి రోజున గణేషుని పూజించుట.
  3. వినాయకుడు,విష్ణు మూర్తి ఆలయాలను దర్శించి, పేదలకు ఆహారం పంచవలెను.
  4. మంగళ వారం రోజున ఖర్జూరం పేదలకు పంచవలెను.
  5. మంగళ వారం రోజున ఉలవలు,అరటిపండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏరోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు మనం ఆ ఆహారాన్ని తినరాదు.
  6. కుక్కలకు,గుర్రములకు ఏ ఆహారాన్ని అయినా పెట్టవలెను.
  7. మూడు మంగళ వారాలు వినాయకుని గుడిలో ఉండ్రాళ్ళు నివేదన చేసి, పేదలకు పంచేది.
  8. శ్రీ కాళహస్తి వెళ్లి కేతు గ్రహ దోష నివారణార్ధం "సర్ప దోష పరిహార పూజ" జరిపించండి.

రాహు గ్రహానికి శాంతులు

  1. పదునెనిమిది వేలు జపం+పదునెనిమిది వందలు క్షీరతర్పణం+నూట ఎనభై హోమం+పదునెనిమిది మందికి అన్నదానం చేసేది.
  2. శ్రీ కాళహస్తి వెళ్లి రాహు దోష నివారణార్ధం సర్ప దోష పరిహారపూజను జరిపించాలి.
  3. సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించాలి.
  4. మూడు శని వారాలు ఏదైనా ఆలయంలో దేవునికి పెరుగు అన్నం(ధద్హోజనం)నివేదన చేసి, పేదలకు దానంగా పంచిపెట్టేది.
  5. దేవి సప్తశతి పారాయణ (లేక) మంత్రం, దేవి కవచం రోజూ పటించాలి.
  6. ప్రతి శని వారం ఒక పలావు పొట్లం ఒక విధవా స్త్రీకి దానం చెయ్యాలి. తయారు చెఇంచ లేకుంటే కొని కూడా ఇవ్వ వచ్చు.
  7. శని వారం రోజు ప్రారంభించి వరుసగా పదునెనిమిది రోజులు పారుతున్న నీటిలో రోజుకో కొబ్బరి కాయ వేయడం వల్ల రాహు గ్రహ దోషం తగ్గి పోవును.
  8. కొద్ది పాటి బొగ్గులని నీట్లోకి ధార పోయటం వల్ల రాహు గ్రహ దోషం పోతుంది.
  9. పడక గదిలో(నిద్రించే గది) నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, లేవగానే చూడటం వల్ల రాహు గ్రహ పీడ నెమ్మదిగా నివారణ అవుతుంది.
  10. ఆదివారం రోజున మినప వడలు కాని, మినప ఉండలు కాని పేదలకు, సాధువులకు పంచండి.

శని గ్రహానికి శాంతులు

  1. శనికి పంతోమ్మిదివేలు జపం+పంతొమ్మిది వందలు క్షీరతర్పణం+నూట తొంభై హోమం+పంతొమ్మిది మందికి అన్నదానం చేసేది.
  2. శనికి పంతొమ్మిది శని వారాలు తైలాభిషేకం చేఇంచి,నువ్వులు దానం ఇచ్చేది.
  3. శని వారం రోజున నువ్వు ఉండలు పేదలకు,సాధువులకు పంచేది.
  4. నవ గ్రహాలకు నలుభై ఒక్క రోజులు ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం చేసి,నువ్వులు దానం ఇచ్చేది.
  5. ప్రతి రోజు మధ్యాహ్నం కాకులకు అన్నం కాని,బెల్లం కలిపినా నల్ల నువ్వులు కాని పెట్టాలి.
  6. అయ్యప్ప స్వామీ దీక్ష మండలం రోజులు స్వీకరించాలి.
  7. హనుమంతుని పూజించవచ్చు,ఉపాసన చేయవచ్చు.అనగా ఆన్జనేయాష్టకం,హనుమాన్ చాలీసా రోజూ పారాయణ చేయ వచ్చు.
  8. శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేఇంచేది.
  9. ప్రవహించే నీటిలో బొగ్గులు,మేకు,నల్ల నువ్వులు,నల్ల గుడ్డ,నువ్వుల నూనె,,గుర్రపు నాడ విడవవలెను.
  10. సనివారం రోజున పంతొమ్మిది సంఖ్య వచ్చే విధంగా దానం చెయ్యాలి.
  11. శని సిన్గానాపూర్,తిరునల్లార్,మందపల్లి,నర్సిన్ఘోలె (లేక)మీ ఊరిలొ ఉన్న శని ఆలయాలను శని వారం రోజున దర్శించి,పూజలు చేఇంచ వచ్చు.
  12. శని వారం రోజు నువ్వులు,అరటి పండు ఆవుకి పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
  13. ధునిలో నువ్వులను వేస్తూ,ఇరవయ్ ఆరు ప్రదక్షిణలు చేసేది.
  14. ఎనిమిది రోజుల పాటు వరుసగా ప్రవహించే నీటిలో బొగ్గులు వేసి రావాలి.

శుక్ర గ్రహానికి శాంతులు

  1. శుక్రునికి ఇరవయ్ వేలు జపం+రెండువేలు క్షీరతర్పణం+రెండొందలు హోమం+ఇరవయ్ మందికి అన్నదానం చేసేది.
  2. శుక్ర గ్రహ దోష నివారణార్థం శ్రీ లక్ష్మి దేవి, పరసు రాముడు ఆలయాలను సందర్సించాలి.
  3. శుక్ర వారం రోజు అలసందులు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ధాన్యం మనం తినరాదు.
  4. పాలతో చక్కర పొంగలిని చేసుకొని,ధునిలో వేయవలెను.
  5. శ్రీ రాజ రాజేశ్వరి దేవి అష్టకాన్ని(లేదా) రాజ రాజేశ్వరి దేవి స్తవాన్ని రోజూ పటించాలి.
  6. మల్లె పూల మాలను లక్ష్మి దేవికి అలంకరించాలి.
  7. చీమలకు పంచదార(చక్కర) ఆహారంగా వేస్తూ ఉండాలి.
  8. దీపావళి పర్వ దినాన లక్ష్మి అష్టకము (లేక) కనకధారా స్తోత్రం ఎనిమిది మార్లు పారాయణ చెయ్యాలి.

గురు గ్రహానికి శాంతులు

  1. గురువుకి పదహారువేలు జపం+పదహారువందలు క్షీరతర్పణం+నూట అరవై హోమం+పదహారు మందికి అన్నదానం చేసేది.
  2. గురు వారం రోజున శనగ గుగ్గిళ్ళు పేదలకు పంచవచ్చు.
  3. గురువులకు సంబందించిన గ్రంధములు నలుభై ఒక రోజులు పారాయణ చెయ్యాలి. అనగా సాయి బాబా, దత్తాత్రేయ,వెంకయ్య స్వామి మొదలగు వారి చరిత్ర.
  4. ప్రతి గురు వారం శివాలయాలు గాని,సాయి మందిరాలు గాని,దత్తాత్రేయ మందిరాలు గాని దర్శించి పూజలు జరిపించ వచ్చును.
  5. గురు వారం రోజు శనగలు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్ట వచ్చు. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ రోజు ఆ ఆహారం తినరాదు.
  6. తేనెను ధునిలో వేస్తూ, పదకొండు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి.
  7. బాదం కాయ, శనగ నూనె, కొబ్బరికాయలను పారుతున్న నీటిలో వేయవచ్చు.

బుధ గ్రహ దోషానికి శాంతులు

  1. బుధునికి పదిహేడువేలు జపం+పదిహేడు వందల క్షీరతర్పణం+నూట డెభై హోమం+పదిహేడు మందికి అన్నదానం చేసేది.
  2. బుధ వారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి.
  3. బుధ వారం రోజున విష్ణు మూర్తి ఆలయాలను దర్శించవచ్చు.(ఉదా:రాముడు,కృష్ణుడు,రంగనాధ స్వామి,నరసింహ స్వామి ఆలయాలు.)
  4. పెసలు,అరటిపండు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకు ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ధాన్యం మీరు తినరాదు.
  5. ఒక రాగి ముక్కకి పెద్ద రంద్రం చేసి, దానిని పారుతున్న నీటిలో వేయవలెను.
  6. బుధ గ్రహం బాగాలేనపుడు నపుమ్సకులకు (కొజ్జాలు) లేదు అనకుండా ధర్మం చెయ్యాలి.
  7. తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం ఐదు మార్లు పారాయణ చేయగలరు.
  8. బుధ వారం రోజున పురుష సూక్తం(లేదా) విష్ణు సూక్తం (లేదా) నారాయణ సూక్తం పారాయణ చేయాలి.
  9. తులసి మాలను పదిహేడు బుధ వారములు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించండి.

కుజ(అంగారక)గ్రహ దోషానికి శాంతులు

  1. కుజునికి ఏడువేలు జపం+ఏడువందలు క్షీరతర్పణం+డెభై హోమం +ఏడుగురికి అన్నదానం చేసేది.
  2. ప్రతి రోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి.
  3. మంగళవారం రోజున యెర్రని కుక్కలకు పాలు,రొట్టెలు ఆహారంగా వెయ్యాలి.
  4. కుజగ్రహ దోష నివారణార్ధం ఆలయాలు దర్శించాలి. అవి కుమారా స్వామి,నరసింహ స్వామి,విష్ణు మూర్తి,ఆంజనేయ స్వామి ఆలయాలు.
  5. కందులు,బెల్లం కలిపి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
  6. పేలాలు ధునిలో వేస్తూ పన్నెండు ప్రదక్షిణాలు చెయ్యాలి.
  7. సుబ్రహ్మణ్య షష్టి పర్వ దినాన సుబ్రహ్మణ్య అష్టకం ఏడు సార్లు పారాయణ చెయ్యాలి.

చంద్ర గ్రహ దోషానికి శాంతులు

  1. చంద్రునికి పది వేలు జపం+వెఇ క్షీరతర్పణం+వంద హోమం+పది మందికి అన్నదానం చేఇంచేది.
  2. సోమవారం రోజున పేదలకు,సాధువులకు,ముష్టి వాళ్లకు అన్నదానం చేయుట(లేక)దద్దోజనం పంచి పెట్టాలి.
  3. పది సోమవారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి,ఒకటింపావు కిలో బియ్యం బ్రాహ్మణుడికి దానం ఇచ్చేది.
  4. సోమవారం రోజుల్లో గౌరీ,పార్వతి,కనకదుర్గ అమ్మవార్ల దేవాలయాలు దర్శించండి.
  5. బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా వెయ్యాలి.
  6. బియ్యం,అరటిపండు,కొంచెం కళ్ళు ఉప్పు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టవచ్చు. గమనిక:ఏరోజు ఆవుకి ఆహారంగా యీధన్యం పెడుతామో ఆరోజు ఆ ఆహారం తీసుకోరాదు.
  7. రోజు రాత్రి పూట పడుకొనేముందు వెండిగ్లాస్ తో పాలు త్రాగి పడుకొనవలెను.
  8. పది మాస శివ రాత్రులు శివునకు పాలాభిషేకం చేసి, తీర్థం స్వీకరించండి.

Wednesday, January 6, 2010

రవి గ్రహ దోషానికి శాంతులు

  1. రవికి ఆరు వేలు జపం+ఆరువందలు క్షీరతర్పణం+అరవయ్ హోమం+ఆరుగురికి అన్నదానం చేసేది.
  2. సూర్య దేవాలయాలను దర్శించుట: ౧.శ్రీకాకుళం జిల్లా లోని అరసవల్లి దేవాలయం దర్శించి అరవయ్ ప్రదక్షిణాలు చెయ్యాలి. ౨.తమిళనాడు లోని సూర్యనార్ దేవాలయంలో సూర్య హోమం జరిపించుట.
  3. రధ సప్తమి రోజున సముద్రస్నానమాచారించి,సూర్య నమస్కారాలు చేసి, సుర్యాష్టకాన్ని కనీసం ఆరు సార్లు జపించాలి.
  4. పేదలకు,ముష్టివాల్లకు,సాధువులకు గోధుమ రొట్టెలు ఆదివారం రోజు పంచాలి.
  5. ప్రతి రోజు ఆదిత్యహృదయం పటించాలి.
  6. ఆరు ఆదివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి ఆరవవారం ఒకకిలోపావు గోధుమలు,దక్షిణ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేది.
  7. గోధుమలు,బెల్లం,కొద్దిగా మిరియాలు కలిపి ఆవుకి ఆహారంగా తినిపించేది. గమనిక:ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు మీరు ఆ ఆహారం తీసుకోరాదు.

Tuesday, January 5, 2010

దైవ సంబంధాలు

  1. తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
  2. ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి,దానితో రెండు ఒత్తులను(దీపారాధన)వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.
  3. శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం,విష్ణువుకి అలంకారం,వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఏవి చేస్తే మంచి జరుగుతుంది.
  4. ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
  5. దీపమును నోటితో ఆర్పరాదు.ఒక దీపం వెలుగుచుండగా,రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
  6. దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
  7. దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
  8. పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.
  9. యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
  10. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
  11. ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
  12. తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.
  13. తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
  14. ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.
  15. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
  16. నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.
  17. జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.
  18. స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.
  19. ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి.

Monday, January 4, 2010

నిత్యకృత్యాలు

మనం ఆచరించాల్సిన రోజు వారి విధానాలు:
  1. పురుషులు నిలబడి మూత్రము పోయరాదు ,పోసిన దరిద్రము,నపుమ్సకత్వము కలుగును.స్త్రీలు నిలబడి మూత్రము పోసిన నరముల బలహీనత,దరిద్రము,భార్తవియోగము కలుగును.
  2. రాత్రిపూట పెరుగుతో తినరాదు అయుశ్హుక్షీనం .పగలు పెరుగు,రాత్రి పాలు వాడిన జ్ఞానవ్రుద్ధి,వీర్యవ్రుద్ధి కలుగును.
  3. భోజనానికి ముందు అరటిపండు,దోసపండు తినరాదు.
  4. చల్లబడిన ఆహారపదార్ధాలను మరల వేడిచేసి తినుట విషతుల్యము.
  5. ఉదయాన్నే నిద్రలేచిన పిదప రాగి పాత్రలోని నీటిని త్రాగితే (రాత్రి రాగిపాత్రలో పోసి ఉంచాలి) ఆయుర్దాయము,ఆరోగ్యము,యవ్వనము కలిగించును.
  6. పడమట(లేక)ఉత్తరంగా(లేక)ఈశాన్యంగా కూర్చొని దంతధావనం చెయ్యాలి.నిలబడి చెయ్యకూడదు.
  7. భోజనము చేయునపుడు పాదములను,పొట్టను తాకుట,నిమురుట చేయరాదు.డబ్బు నిలవదు.
  8. మొకాల్లకులోన చేతులుంచి భోజనం చేసిన కీర్తి,అభివృద్ధి కలుగును.
  9. ఉదయాన నిద్ర లేచేటప్పుడు కుడి వైపుకి తిరిగి లేవవలెను. నిద్ర లేవ గానే అర చేతిని చూచు కొనవలెను. తరువాత ఏ దేవుని స్తోత్ర మైన జపించాలి. పక్క దిగే ముందు చేతి తో నేలను తాకి,భూమాతను క్షమించ మని అడగాలి.
  10. వేపపుల్ల, జామాయిల్ పుల్లలతో పళ్ళు తోమరాదు.
  11. చేతి, కాలి గోళ్ళు సోమవారం, బుధవారం,గురువారం రోజున తీసుకోవాలి. ఫలం: లాభం, మనస్సాంతి ,ఆరోగ్యం, గౌరవం కలుగును. మంగళవారం,ఆదివారం,శుక్రవారం,శనివారం రోజులలో గోళ్ళు తీసుకొనరాదు. ఫలం: ధన వ్యయం, కలహములు, చిక్కులు,కష్టాలు, వ్యాధి, దుర్వార్తా శ్రవణం మొదలగునవి జరుగును.
  12. సూర్యునికి ఎదురుగా నిలబడి మూత్ర, మల విసర్జన చేయరాదు.
  13. నిత్యం చల్లని నీటితోనే స్నానం చెయ్యాలి. వేడి నీటితో గాని, ఇతరులకు సంబంధించిన నీటితో గాని స్నానం చేసిన అదృష్టం కలసిరాదు.
  14. తూర్పు, దక్షిణం దిశగా తల ఉంచి పండుకోవాలి. పడమట, ఉత్తరము వైపు తల ఉంచి నిద్రించరాదు. నిద్రించునపుడు దుప్పటిని తలపైగా కప్పుకొనరాదు. చాతిపై చేతులుంచి, వెల్లికిలా పండుకొనరాదు.
  15. మధ్యాహ్నం నిద్రించరాదు.
  16. మీరు ఇంటి నుండి బైటకు పోయేటపుడు,లోనికి వచ్చేటపుడు విధిగా కాళ్ళు కడగటం అలవర్చుకోండి.