Sunday, January 17, 2010

దైవ సంబంధాలు-రెండో పేజి

  1. అయ్యప్ప మాల ధరించ కూడని సందర్బములు: కుటుంబములో తల్లి, తండ్రి మరణించిన చొ ఏడాది కాలము సూతకము పాటించ వలెను.కావున ఆ కాలములో తనయులు శబరిమలకు మాల దరించ కూడదు. భార్య మరణించిన చో ఒక ఏడాది,సోదరులు ,putrulu, అల్లుళ్ళు,మేనత్తలు,మేన మామలు,తాత,బామ్మ మున్నగు వారు మరణించిన చో ముపై దినములు,మనుమళ్ళు,మనుమరాళ్ళు,దాయాదులు మరణించినచో ఇరవై ఒక దినములు, ఇంటి పేరు గలవారు,రక్త సంబంధీకులు, వియ్యాల వారు మరణించినచో పదమూడు దినములు, ఆత్మీయులు, మిత్రులు మరణించినచో మూడు దినములు దీక్ష తీసు కొనరాదు. తల్లి,భార్య,కూతురు,కోడలు,మరదలు మున్నగు వారు ఇదు నెలల గర్బిని ఇనచో మాల ధరించరాదు. దీక్షలో ఉండగా బంధు వర్గాదులలో yevvaru మరనిన్చినాను ఆ వార్త తెలియగానే మాల విసర్జన చెయ్యవలెను.అలా కాక మాలో మాకు మాట పలుకులు లేవు,కనుక మాకు ఆ మరణంతో ఎలాంటి పట్టింపులు లేవు అనకూడదు. ఏ కారణం చేతనైనా మాల విసర్జన జరిగినచో మరల ఆ ఏడాది మాల దరించ రాదు.ఇరుముడి లేకుండా మామూలు దుస్తులతో స్వామీ వారిని దర్శించ వచ్చును.
  2. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటపుడు ఈ మంత్రమును జపిస్తూ తిరగాలి. "ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయచ, గురుశుక్ర, సనిభ్యస్చ, రాహవే కేతవే నమః ".
  3. ఎల్లవేళలా అనగా ఖాళిసమయంలో ఏదో ఒక మంత్రం పటిస్తూ ఉండండి. భీజాక్షరాలు వద్దు. ఉదా: ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.

No comments:

Post a Comment