Wednesday, January 6, 2010

రవి గ్రహ దోషానికి శాంతులు

  1. రవికి ఆరు వేలు జపం+ఆరువందలు క్షీరతర్పణం+అరవయ్ హోమం+ఆరుగురికి అన్నదానం చేసేది.
  2. సూర్య దేవాలయాలను దర్శించుట: ౧.శ్రీకాకుళం జిల్లా లోని అరసవల్లి దేవాలయం దర్శించి అరవయ్ ప్రదక్షిణాలు చెయ్యాలి. ౨.తమిళనాడు లోని సూర్యనార్ దేవాలయంలో సూర్య హోమం జరిపించుట.
  3. రధ సప్తమి రోజున సముద్రస్నానమాచారించి,సూర్య నమస్కారాలు చేసి, సుర్యాష్టకాన్ని కనీసం ఆరు సార్లు జపించాలి.
  4. పేదలకు,ముష్టివాల్లకు,సాధువులకు గోధుమ రొట్టెలు ఆదివారం రోజు పంచాలి.
  5. ప్రతి రోజు ఆదిత్యహృదయం పటించాలి.
  6. ఆరు ఆదివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి ఆరవవారం ఒకకిలోపావు గోధుమలు,దక్షిణ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేది.
  7. గోధుమలు,బెల్లం,కొద్దిగా మిరియాలు కలిపి ఆవుకి ఆహారంగా తినిపించేది. గమనిక:ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు మీరు ఆ ఆహారం తీసుకోరాదు.

No comments:

Post a Comment