Thursday, January 7, 2010

రాహు గ్రహానికి శాంతులు

  1. పదునెనిమిది వేలు జపం+పదునెనిమిది వందలు క్షీరతర్పణం+నూట ఎనభై హోమం+పదునెనిమిది మందికి అన్నదానం చేసేది.
  2. శ్రీ కాళహస్తి వెళ్లి రాహు దోష నివారణార్ధం సర్ప దోష పరిహారపూజను జరిపించాలి.
  3. సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించాలి.
  4. మూడు శని వారాలు ఏదైనా ఆలయంలో దేవునికి పెరుగు అన్నం(ధద్హోజనం)నివేదన చేసి, పేదలకు దానంగా పంచిపెట్టేది.
  5. దేవి సప్తశతి పారాయణ (లేక) మంత్రం, దేవి కవచం రోజూ పటించాలి.
  6. ప్రతి శని వారం ఒక పలావు పొట్లం ఒక విధవా స్త్రీకి దానం చెయ్యాలి. తయారు చెఇంచ లేకుంటే కొని కూడా ఇవ్వ వచ్చు.
  7. శని వారం రోజు ప్రారంభించి వరుసగా పదునెనిమిది రోజులు పారుతున్న నీటిలో రోజుకో కొబ్బరి కాయ వేయడం వల్ల రాహు గ్రహ దోషం తగ్గి పోవును.
  8. కొద్ది పాటి బొగ్గులని నీట్లోకి ధార పోయటం వల్ల రాహు గ్రహ దోషం పోతుంది.
  9. పడక గదిలో(నిద్రించే గది) నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, లేవగానే చూడటం వల్ల రాహు గ్రహ పీడ నెమ్మదిగా నివారణ అవుతుంది.
  10. ఆదివారం రోజున మినప వడలు కాని, మినప ఉండలు కాని పేదలకు, సాధువులకు పంచండి.

1 comment:

  1. hello sir

    my name is indumati
    its a good site. i have so meny doubts in this matter and i search meny years. u r site is solved my doubts. so meny people use this site and solve their problems. very very thankful to you. .

    ReplyDelete