Thursday, January 7, 2010

గురు గ్రహానికి శాంతులు

  1. గురువుకి పదహారువేలు జపం+పదహారువందలు క్షీరతర్పణం+నూట అరవై హోమం+పదహారు మందికి అన్నదానం చేసేది.
  2. గురు వారం రోజున శనగ గుగ్గిళ్ళు పేదలకు పంచవచ్చు.
  3. గురువులకు సంబందించిన గ్రంధములు నలుభై ఒక రోజులు పారాయణ చెయ్యాలి. అనగా సాయి బాబా, దత్తాత్రేయ,వెంకయ్య స్వామి మొదలగు వారి చరిత్ర.
  4. ప్రతి గురు వారం శివాలయాలు గాని,సాయి మందిరాలు గాని,దత్తాత్రేయ మందిరాలు గాని దర్శించి పూజలు జరిపించ వచ్చును.
  5. గురు వారం రోజు శనగలు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్ట వచ్చు. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ రోజు ఆ ఆహారం తినరాదు.
  6. తేనెను ధునిలో వేస్తూ, పదకొండు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి.
  7. బాదం కాయ, శనగ నూనె, కొబ్బరికాయలను పారుతున్న నీటిలో వేయవచ్చు.

No comments:

Post a Comment