మనం ఆచరించాల్సిన రోజు వారి విధానాలు:
- పురుషులు నిలబడి మూత్రము పోయరాదు ,పోసిన దరిద్రము,నపుమ్సకత్వము కలుగును.స్త్రీలు నిలబడి మూత్రము పోసిన నరముల బలహీనత,దరిద్రము,భార్తవియోగము కలుగును.
- రాత్రిపూట పెరుగుతో తినరాదు అయుశ్హుక్షీనం .పగలు పెరుగు,రాత్రి పాలు వాడిన జ్ఞానవ్రుద్ధి,వీర్యవ్రుద్ధి కలుగును.
- భోజనానికి ముందు అరటిపండు,దోసపండు తినరాదు.
- చల్లబడిన ఆహారపదార్ధాలను మరల వేడిచేసి తినుట విషతుల్యము.
- ఉదయాన్నే నిద్రలేచిన పిదప రాగి పాత్రలోని నీటిని త్రాగితే (రాత్రి రాగిపాత్రలో పోసి ఉంచాలి) ఆయుర్దాయము,ఆరోగ్యము,యవ్వనము కలిగించును.
- పడమట(లేక)ఉత్తరంగా(లేక)ఈశాన్యంగా కూర్చొని దంతధావనం చెయ్యాలి.నిలబడి చెయ్యకూడదు.
- భోజనము చేయునపుడు పాదములను,పొట్టను తాకుట,నిమురుట చేయరాదు.డబ్బు నిలవదు.
- మొకాల్లకులోన చేతులుంచి భోజనం చేసిన కీర్తి,అభివృద్ధి కలుగును.
- ఉదయాన నిద్ర లేచేటప్పుడు కుడి వైపుకి తిరిగి లేవవలెను. నిద్ర లేవ గానే అర చేతిని చూచు కొనవలెను. తరువాత ఏ దేవుని స్తోత్ర మైన జపించాలి. పక్క దిగే ముందు చేతి తో నేలను తాకి,భూమాతను క్షమించ మని అడగాలి.
- వేపపుల్ల, జామాయిల్ పుల్లలతో పళ్ళు తోమరాదు.
- చేతి, కాలి గోళ్ళు సోమవారం, బుధవారం,గురువారం రోజున తీసుకోవాలి. ఫలం: లాభం, మనస్సాంతి ,ఆరోగ్యం, గౌరవం కలుగును. మంగళవారం,ఆదివారం,శుక్రవారం,శనివారం రోజులలో గోళ్ళు తీసుకొనరాదు. ఫలం: ధన వ్యయం, కలహములు, చిక్కులు,కష్టాలు, వ్యాధి, దుర్వార్తా శ్రవణం మొదలగునవి జరుగును.
- సూర్యునికి ఎదురుగా నిలబడి మూత్ర, మల విసర్జన చేయరాదు.
- నిత్యం చల్లని నీటితోనే స్నానం చెయ్యాలి. వేడి నీటితో గాని, ఇతరులకు సంబంధించిన నీటితో గాని స్నానం చేసిన అదృష్టం కలసిరాదు.
- తూర్పు, దక్షిణం దిశగా తల ఉంచి పండుకోవాలి. పడమట, ఉత్తరము వైపు తల ఉంచి నిద్రించరాదు. నిద్రించునపుడు దుప్పటిని తలపైగా కప్పుకొనరాదు. చాతిపై చేతులుంచి, వెల్లికిలా పండుకొనరాదు.
- మధ్యాహ్నం నిద్రించరాదు.
- మీరు ఇంటి నుండి బైటకు పోయేటపుడు,లోనికి వచ్చేటపుడు విధిగా కాళ్ళు కడగటం అలవర్చుకోండి.
hai ASHOK this is ASHOK just now I show ur blog to my coliegs they feel very happy and they appreciated me so do this type of good things for people O.K.
ReplyDeletehi,Ashok yours blog contains valuable information which is not available to all,whenever required.I really appreciate u for doing this kind of good things.
ReplyDeleteఅసోక్ గారు చాలాబాగున్నాయి.
ReplyDelete