Saturday, January 16, 2010

ఆహార విషయాలు

  1. యజ్ఞ యాగాదులకు పిలవకున్నను వెళ్ళవలెను. పెళ్ళికి పిలిస్తేనే వెళ్ళాలి. బంధువులుకాని యెడల వారి కర్మ క్రియలకు,భోజనాలకు పిలిచినా వెళ్ళరాదు. ఆ భోజనం చేయుట దోషం.
  2. అరటి పండును తిన్న వెంటనే మజ్జిగ త్రాగరాదు.
  3. భోజనము చేసిన వెంటనే స్నానము చేయరాదు.
  4. ఉపవాసము చేయునపుడు తినతగినవి: నిషిద్ధములు కాని దుంపలు, పచ్చి కాయలు, కొబ్బరి, కొబ్బరినీళ్ళు, పిండితో చేసిన రొట్టెలు,నీళ్ళు, ఉప్పుడుపిండి, గుగ్గిళ్ళు, పంచదార, బెల్లంతో కలిపినవి, పేలాలు, అటుకులు. ఇవి ఫలములతో సమానము తినవచ్చు.
  5. కార్తీక మాస భోజన విశిష్టత: కార్తీక మాసమందు ఏ దినమునందైన బ్రహ్మనులతోను, బంధువులతోను కలసి రావి, వేప, పెద్ద ఉసిరి, మామిడి, మారేడు, వెలగ, మర్రి, చింత వీటితో కూడి ఉండి బావి యున్న వనమున భోజనము చేసిన వారు వరుసగా నూరు జన్మలందు జగదీస్వరుడై జన్మించును. దీనికి దృష్టి దోషం లేదు.
  6. అరటి, మర్రి ఆకులతో చేసిన విస్తర్లలో భోజనం చెయ్యాలి. మట్టి(లేదా) రాగి పాత్రలో నీరు త్రాగితే శ్రేష్టం.
  7. అన్నదానం చేయాలనుకుంటే ఎంగిలిది, వదిలేసినది, పాడైనది పెట్టవద్దు. అన్నదానమిచ్చిన తర్వాత మీరు తినండి.

No comments:

Post a Comment