Wednesday, January 20, 2010

వివాహము-ఇతరములు

  1. అక్క చెల్లెళ్ళకు ఒకే సంవత్సరము గాని, ఒకే సమయమందు గాని వివాహము చేయరాదు. అట్లు చేసిన ఒకరు వితంతువ అగును.
  2. భార్య గర్భవతిగా ఉంటె గృహ నిర్మాణము చేయరాదు. కొండలు ఎక్కరాదు. ఉదా:తిరుమల, శబరిమలై.
  3. పుట్టిన పిల్లవానికి పదకొండవ రోజు(లేదా) పదమూడవరోజు నామ కారణం చెయ్యాలి. ఆరు నెలల వయస్సు వచ్చిన తర్వాత అన్న ప్రాసన చేయాలి. పురుషులకు సరి, స్త్రీలకు బేసి నెలలో అన్నప్రాసన చేయాలి.
  4. పగటి పూట సంభోగించ రాదు. భార్య తోనైనా సంభోగించరాదు. తన కంటే ఎక్కువ వయస్సున్న స్త్రీతో సంభోగించరాదు.
  5. వివాహంలో తలమ్బ్రాలలో బియ్యంతో గులాబి పూలు త్రుంచి వేయుట, తొడిమలతో వేయుట చేయరాదు. అలా త్రుంచి వేసిన భార్యాభర్తలకు ఈజన్మలో గాని, మరు జన్మలో గాని కలహములు, ఎడబాటులు యేర్పడును. వారిలో ఒకరు ఆకాలములో మరనించుట జరుగును.
  6. గర్భిణి స్త్రీ ఏది కోరితే ఆ వస్తువు తెచ్చి ఇవ్వాలి. గర్భవతికి ఆరు నెలలు నిండిన పిమ్మట ఆమె భర్త గృహారంభం, సముద్ర ప్రయాణం, క్షౌరం చేసుకొనుట, శ్రాద్ధాన్న భోజనం చేయుట, పుణ్యతీర్ధములు సేవించుట, శవము ను మోయుట, శవం వెంట నడచుట, సంభోగం చేయుట, నదీస్నానములు చేయుట, కొండలు ఎక్కుట, దూర దేశ నివాసములు, కలహించుట మొదలగునవి చేయకూడదు. ఇంకా గర్భిణిస్త్రీ ఏనుగు,పర్వతాలు,మేడలు ఎక్కరాదు. దిగంభారాలై స్నాన మాడరాదు. అసుర సంధ్య వేళ భుజించ రాదు. సంభోగం చేయరాదు. గోళ్ళు కొరుకుట, గిల్లుట, ఆకులు తుంచుట చేయరాదు. మాంసం తినరాదు.
  7. కొత్త కోడలు అత్తవారింట ఉండుట, కాపురమునకు వెళ్ళుట: వివాహమైన సంవత్సరములో మొదటి ఆషాడ మాసమున కోడలు అత్త వారింటఉన్న అత్తకు గండము, క్షయ మాసమున ఉన్న తానే మరణించును. జ్యేష్ట మాసమున ఉన్న బావకు గండం. పుష్య మాసమున ఉన్న మామకు, అధిక మాసమున ఉన్న భర్తకి గండము. చైత్ర మాసమున తండ్రిఇంట నున్న తండ్రికి గండము. మిగిలిన మాసములు సుఖము కలుగును.

1 comment: